శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2016 (15:38 IST)

మేలి జాతి గుర్రం పేరు సుల్తాన్.. ఆడి కారు కంటే ధరెక్కువ.. పాస్‌పోర్ట్ రెడీ? రోజుకు లక్ష?

హర్యానాలోని ఓ స్వచ్ఛమైన మేలి జాతి గుర్రం ''సుల్తాన్'' ఆడి కారు కంటే అధిక ధర పలికింది. ఈ గుర్రం కోసం రూ.51లక్షలు ఇస్తామని యజమాని గుర్వీందర్ సింగ్‌కు ఆఫర్ చేశారు. సుల్తాన్‌ను సొంత కొడుకులా భావించే యజమాన

హర్యానాలోని ఓ స్వచ్ఛమైన మేలి జాతి గుర్రం ''సుల్తాన్'' ఆడి కారు కంటే అధిక ధర పలికింది. ఈ గుర్రం కోసం రూ.51లక్షలు ఇస్తామని యజమాని గుర్వీందర్ సింగ్‌కు ఆఫర్ చేశారు. సుల్తాన్‌ను సొంత కొడుకులా భావించే యజమాని ఆ ఆఫర్‌కు నో చెప్పాడట. ఆడి కారు కంటే గుర్రమే తనకు ప్రాణమని గుర్వీందర్ అంటున్నారు. హర్యానాలోని కర్నల్ జిల్లాలో డబ్రీ అనే గ్రామంలో నుక్రా జాతికి చెందిన ఈ తెల్లటి గుర్రం అందరినీ ఆకర్షిస్తోంది. 
 
పానిపట్‌లో జరిగిన ఆల్ ఇండియా చాంపియన్ పోటీల్లో ఈ గుర్రం విజేతగా నిలిచింది. 2012లో కూడా జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఎక్కడ గుర‍్రపు పందేలు జరిగినా సుల్తాన్‌దే గెలుపు. 15 ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఈ గుర్రం కోసం గుర్వీందర్ ప్రతి నెలా లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సుల్తాన్ సాధారణ ఆహారంతో పాటు రోజుకు ఐదు లీటర్ల ఆవు పాలు, 100 గ్రాముల నెయ్యి తీసుకుంటుంది.
 
ఇంకా చెప్పాలంటే.. గుర్వీందర్ సింగ్ సుల్తాన్‌కు పాస్‌పోర్ట్‌ కూడా అప్లై చేశారు. ఇందుకోసం సుల్తాన్ బ్లడ్ శాంపిల్స్, డీఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ కూడా టెస్టుకు వెళ్లాయి. పాస్ పోర్టు దొరికితే.. విదేశాల్లో జరిగే పోటీల్లో సుల్తాన్ పాలుపంచుకుంటుందని గుర్వీందర్ సింగ్ వెల్లడించారు.