సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (20:17 IST)

జయలలిత కోసం ఎంకే స్టాలిన్ ప్రార్థన... దర్శన భాగ్యం లేదు... త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష...

అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు డీఎంకే కోశాధికారి, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ శనివారం చెన్నై అపోలో ఆస్పత్రికి శనివారం

అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు డీఎంకే కోశాధికారి, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ శనివారం చెన్నై అపోలో ఆస్పత్రికి శనివారం రాత్రి వచ్చారు. అయితే, ఆయనకు జయలలితను చూసే అవకాశం దక్కలేదు. సీనియర్ నేత దురైమురుగన్‌తో కలిసి ఆస్పత్రికి వచ్చిన స్టాలిన్‌ను మంత్రి ఓ పన్నీర్ సెల్వం, పళనిస్వామి, జయలలిత స్నేహితురాలు శశికళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత వద్దకు తీసుకెళ్లి చూపించారు. 
 
జయలలితను చూసి బయటకు వచ్చిన ఎంకే.స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ... జయలలిత త్వరగా కోలుకోవాలని తమ పార్టీ అధినేత కరుణానిధితో పాటు.. తమ పార్టీ తరపున ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి ఆమె పూర్తిగా కోలుకోలేదని, పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్టు వెల్లడించారు. 
 
మరోవైపు.. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి ఎండీఎంకే అధినేత వైగో కూడా శనివారం వెళ్లారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, జయలలిత ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడుతుందనే నమ్మకం తనకుందన్నారు. జయకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని... లక్షలాది ఏఐఏడీఎంకే కార్యకర్తల ఆందోళనలన్నీ త్వరలోనే మటుమాయమవుతాయని చెప్పారు. జయకు వైద్యం చేస్తున్న డాక్టర్లతో కూడా తాను మాట్లాడానని తెలిపారు. జయలలిత హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని తెలిసినప్పుడు తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. 
 
అదేసమయంలో జయలలిత కోలుకునేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలంటూ డీఎంకే నేత స్టాలిన్ చేసిన డిమాండ్‌పై స్పందిస్తూ.. 2009లో కరుణానిధి అస్వస్థతకు గురైనప్పుడు ఆయన దాదాపు 45 రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉన్నారని... అప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించారా? అంటూ ప్రశ్నించారు.