మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (10:15 IST)

ప్రేమ పేరుతో మోసం.. ముగ్గురు స్నేహితులతో సెక్స్ చేయాలంటూ ఒత్తిడి!

ఓ యువతి ప్రేమ పేరుతో తన ప్రియుడి చేతిలో మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా కూడా దగ్గరైంది. కొంతకాలం వాడుకున్న తర్వాత ఆ ప్రియుడు తనలోని మరోకోణాన్ని బయటపెట్టాడు. తన ముగ్గురు స్నేహితులతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశాడు. లేకపోతే, నగ్న ఫోటోలు బయటపెడతానని, అవి బయటపెట్టకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ప్రియుడు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేని ఆ యువతి.. వంతెనపై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన షాదాబ్ అనే యువకుడు ఓ యువతిని వెంటపడీమరీ ప్రేమించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొంతకాలం హాయిగా గడిపారు. అయితే ఆమెకు తెలియకుండా యువతి అసభ్యకర చిత్రాలను చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. 
 
తన ముగ్గురు స్నేహితులను పిలిచి ఆమెకు పరిచయం చేశాడు. వారితో సెక్స్ చేయాలని, లేదంటే తనకు రూ.50వేలు ఇవ్వాలని బెదిరించసాగాడు. లేదంటే ఆమె అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. 
 
ప్రేమించిన వాడు ఇంతలా మోసం చేయడంతో ఏం చేయాలో తెలియని ఆ యువతి.. మరణమే శరణ్యం అనుకొని ఒక వంతెన ఎక్కి కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమె నడుం దగ్గర నుంచి కింది శరీరం పారలైజ్ అయిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.