గురువారం, 17 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2016 (16:53 IST)

చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చెత్తాచెదారంతో భార్య చితికి నిప్పంటించిన భర్త

మాతృమూర్తి, పేదల పెన్నిధి మదర్ థెరిసా‌కు సెయింట్ హోదా కల్పించిన రోజునే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హృదయవిదారకమైన సంఘటన ఒకటి జరిగింది. పేదరికంతో తన భార్య అంతక్రియల కోసం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చుట

మాతృమూర్తి, పేదల పెన్నిధి మదర్ థెరిసా‌కు సెయింట్ హోదా కల్పించిన రోజునే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హృదయవిదారకమైన సంఘటన ఒకటి జరిగింది. పేదరికంతో తన భార్య అంతక్రియల కోసం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చుట్టుపక్కల దొరికిన చెత్తాచెదారం పోగుచేసి భార్య చితికి భర్త నిప్పు అంటించాడు. ఈ సంఘటన గతవారం ఇండోర్‌కు సమీపంలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రతన్‌గర్ సమీపంలోని గిరిజన గ్రామంలో నోజీభాయ్ అనే మహిళ మృతి అనారోగ్యం కారణంగా చనిపోయింది. ఆమె భర్త జగదీష్ దహనసంస్కాలు చేయడానికి భార్య శవాన్ని శ్మశానవాటికకు తరలించాడు. అయితే, శ్మశానవాటికలో దహనసంస్కారాలకు రూ.2,500 చెల్లించాల్సి ఉంది. అంత సొమ్ము తన వద్ద లేదని చెప్పడంతో దహనసంస్కారాలు చేయడం కుదరని రతన్గర్ పంచాయితీ పెద్దలు తేల్చిచెప్పారు. 
 
దీంతో దిక్కుతోచని అతను 3 గంటల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జనం పారేసిన చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ బ్యాగులు వంటివి పోగుచేసి చితి ఏర్పాటు చేసి నిప్పుపెట్టాడు. ఈ విషయం నీముచ్ కలెక్టర్ రజనీష్ శ్రీవాస్త్రవ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. దహనసంస్కారాలకు కలప దంగలు సమకూర్చాలంటూ ఎస్‌డీఎంకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రతన్గర్ గ్రామపెద్దలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.