శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (21:07 IST)

ముమైత్ ఖాన్ మోసం చేసింది.. ఆటోడ్రైవర్

ఓ క్యాబ్ డ్రైవర్‌ ను నటి ముమైత్‌ ఖాన్‌ మోసం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ కు చెందిన రాజు అనే డ్రైవర్ కు చెందిన క్యాబ్‌ లో గోవా వరకూ వెళ్లిన ముమైత్‌ ఖాన్ ముందు మూడు రోజులకి అని క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే అక్కడికి వెళ్ళాక ఎనిమిది రోజులకు టూర్ పొడిగించింది.

అయినా సరే డబ్బు వస్తుంది కదా అని తాను సర్ది చెప్పుకున్నానని కానీ ఎనిమిది రోజులు అయ్యాక డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిందని అతను ఆరోపిస్తున్నాడు.

కనీసం టోల్‌ గేట్, అకామడేషన్‌ డబ్బులు కూడా ఆమె తనకు ఇవ్వ లేదని మొత్తం 15వేల రూపాయలు తనకు ముమైత్ నుంచి రావాలని అంటున్నాడు.

మరో డ్రైవర్‌ కు ఇలాంటి మోసం జరగకూడదని మీడియా దాకా వచ్చానన్న రాజు ఈ విషయాన్ని క్యాబ్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తానన్నాడు.  ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేస్తానంటున్నారు.