శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (14:20 IST)

విచ్చలవిడి శృంగారం కోసం మద్యంలో దగ్గుమందు కలిపి సేవించిన మహిళ...

విచ్చలవిడి శృంగారం కోసం మద్యంలో దగ్గుమందు కలుపుకుని ఓ మహిళ సేవించింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని భీవాండీలో చోటుచేసుకుంది.

విచ్చలవిడి శృంగారం కోసం మద్యంలో దగ్గుమందు కలుపుకుని ఓ మహిళ సేవించింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని భీవాండీలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మహారాష్ట్రలోని ముంబ్రా ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన 26 యేళ్ల యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో ప్రియుడితో కలిసి మెరుగైన, విచ్చలవిడి శృంగారం పొందాలని భావించింది. దీంత తన ప్రియుడితో కలిసి భీమాండీ పట్టణంలోని ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నారు. అలాగే, రెండు బాటిళ్ల దగ్గుమందు, ఓ మద్యం బాటిల్ తీసుకెళ్లి, రెండు కలుపుకుని సేవించింది. అనంతరం డ్రగ్ ఇంజెక్షన్ కూడా తీసుకుంది. గంట తర్వాత మహిళ కాస్తా స్పృహ కోల్పోవడంతో భయపడిన ప్రియుడు లాడ్జీ వదిలి పారిపోయాడు. 
 
కొన్ని గంటల తర్వాత లాడ్జీ వెయిటర్ గది తలుపు కొట్టినా ఎవరూ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి లాడ్జీ గది తలుపు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న వివాహిత కనిపించింది. ఆమెను వెంటనే ఐజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. పోలీసులకు లాడ్జీ గదిలో నుంచి దగ్గు మందు ఖాళీ బాటిళ్లు, మద్యం ఖాళీ బాటిల్ దొరికాయి. 
 
వివాహిత బాయ్‌ఫ్రెండ్ వాంగ్మూలాన్ని భీవాండి పోలీసులు రికార్డు చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన కూతురికి గతంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయని, మూడో భర్త డ్రగ్‌కు బానిస అని ఆయన ద్వారానే ఆమె డ్రగ్స్‌కు అలవాటు పడిందని మృతురాలి తండ్రి వెల్లడించారు.