బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జులై 2021 (22:51 IST)

బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి యువతిపై అత్యాచారం.. మద్యం తాగించి?

డేటింగ్‌ యాప్‌లు.. కొందరికి శాపంగా మారుతున్నాయి. ఆ యాప్‌ల ద్వారా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. మంచి మాటలతో నమ్మించి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ముంబైలో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి యువతిపై అత్యాచారం చేశాడు.
 
ముంబైకి చెందిన ఓ యువతికి డేటింగ్‌ యాప్‌లో ఓ యువకుడు నెల కిందట పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య చాటింగ్‌ నడుస్తోంది. ఈ క్రమంలో జూలై 26న ఆమె పుట్టిన రోజు. ఇదే అదనుగా యువకుడు స్కెచ్ వేశాడు. ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం వర్లీలోని ఓ స్టార్‌ హోటల్‌లో బర్త్‌ డే ఏర్పాట్లు చేశాడు.
 
ఆమెను హోటల్‌కు ఆహ్వానించాడు. అతడి మాటలు నమ్మిన యువతి హోటల్‌కి వెళ్లింది. అక్కడ ఆమెకు ఆ యువకుడు మద్యం తాగించాడు. యువతి మత్తులోకి జారుకుంది.
 
ఆ తర్వాత అతడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు నుంచి తేరుకున్న యువతి విషయం తెలిసి షాక్‌ కి గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.