సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (15:17 IST)

ఫ్రెండ్‌తో కలిసి మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆగడాలు... కన్నబిడ్డలపైనే..

హైదరాబాద్ నగరంలో తన స్నేహితుడితో కలిసి ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు కొందరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరువురిపై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఠాణాలో పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఎన్ఆర్ఐ (45) జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 70లో భార్య, కుమార్తె (14), కుమారుడు (11)తో కలిసి ఉంటున్నాడు. 
 
2018లో ఏర్పడిన గొడవల నేపథ్యంలో దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కొద్ది కాలంగా పిల్లలు ఇద్దరు దిగులుగా ఉండటంతో తల్లి వారిని ఒక సైకాలజిస్టు వద్ద కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. 
 
తమ తండ్రి తమతో అయిదారేళ్ల కిందట అసభ్యంగా ప్రవర్తించారని, తండ్రితో పాటు అతడి స్నేహితుడు కూడా తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని వివరించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
నిందితుడు, అతడి స్నేహితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తండ్రిని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు. తండ్రి పక్కనున్న సమయంలోనే అతడి స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ కుమార్తె గతంలోనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.