మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (08:09 IST)

ప్రముఖ సంగీత దర్శకుడు ఖయ్యం కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మీ కన్నుమూశారు.  కభీ కభీ, ఉమ్రావ్ జాన్ వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఆయన వయస్సు 92 ఏళ్లు. వృద్ధాప్యానికి సంబంధించిన వ్యాధులతో కొద్దికాలంగా ఆయన బాధపడుతున్నారు. 
 
ముంబైలోని సుజయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి 9,30 గంటల సమయంలో మరణించారు. కొద్దిరోజులుగా ఆయన సుజయ్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. 
 
ఖయ్యాం సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు కూడా ఇచ్చి గౌరవించింది. ఖయ్యం తన 17వ యేట లూథియానాలో తన సంగీత వృత్తిని ప్రారంభించారు. ఉమ్రావ్ జాన్ సినిమాకు సంగీతం అందించిన తర్వాత ఆయన పేరు బాలీవుడ్ లో మారుమ్రోగింది.