గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2016 (11:04 IST)

చిన్నమ్మ సీఎం పగ్గాలు చేపడతారు.. శశికళ అనుకుని వుంటే?: నవనీత కృష్ణన్

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత తమిళనాడు సీఎం జయలలిత భౌతికకాయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి నివాళులర్పించినందుకు జయ సన్నిహితురాలు వీకే శశికళ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత తమిళనాడు సీఎం జయలలిత భౌతికకాయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి నివాళులర్పించినందుకు జయ సన్నిహితురాలు వీకే శశికళ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రణబ్, ప్రధాని, రాహుల్ గాంధీలు వచ్చి తనను ఓదార్చడం.. సంతాపం తెలపడం తనను భావోద్వేగానికి గురిచేసిందని ఆయా లేఖల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న రాసిన ఈ లేఖలను అన్నాడీఎంకే మంగళవారం విడుదల చేసింది.
 
జయలలిత నెచ్చెలి అయిన శశికళ ఆమె మరణం తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు అప్పగించడంతోపాటు.. తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా ఆమెనే కొనసాగించాలని అన్నాడీఎంకే భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్న ఆమె నెచ్చెలి శశికళ తర్వలో ముఖ్యమంత్రి పదవిని కూడా అధిష్టించనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతేగాకుండా.. శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కొందరు మంత్రులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ రాజ్యసభ సభ్యుడు నవనీత కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు సంచలన ప్రకటన చేశారు.
 
తమిళ వెబ్‌పోర్టల్ ఒకటి నవనీత కృష్ణన్‌తో నిర్వహించిన ముఖాముఖిలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. శశికళ కోసం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం పదవిని వదులుకుంటారా? అన్న వెబ్‌ పోర్టల్ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘చిన్నమ్మ తలచుకుంటే ఈ నెల 5నే ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆమెను ఎవరూ ప్రశ్నించలేరు. త్వరలో చిన్నమ్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు’’ అని నవనీతకృష్ణన్‌ పేర్కొన్నారు.