మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (10:49 IST)

ఎన్‌కౌంటర్ జరిగిన కాసేపటికే అమ్మాయిని ఎత్తుకెళ్లారు..

ఎన్‌కౌంటర్ జరిగిన కాసేపటికే చత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు మరోమారు తెగబడ్డారు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేశారు. విద్యార్థి బెజ్జీ నుంచి కొండాకు వెళ్తుండగా నక్సలైట్లు అతడిని కిడ్నాప్ చేస

ఎన్‌కౌంటర్ జరిగిన కాసేపటికే చత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు మరోమారు తెగబడ్డారు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేశారు. విద్యార్థి బెజ్జీ నుంచి కొండాకు వెళ్తుండగా నక్సలైట్లు అతడిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, అంతకుముందే  పోలీసులకు నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. 
 
ఓ నక్సలైట్‌ను పోలీసులు సజీవంగా పట్టుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే విద్యార్థిని కిడ్నాప్ చేయడం సంచలనం రేపుతోంది. విద్యార్థి కోసం రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ముగ్గురు నక్సల్స్‌ను అంతమొందించారు. వారి వద్ద భారీ గన్స్, బాంబులు,315 బోర్ పిస్టోల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.