ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (11:32 IST)

పాముకాటుకు ప్రతీ ఏటా 50వేల మంది చనిపోతున్నారట? అడవి విస్తీర్ణం తగ్గడమే కారణమా?

పాముకాటు ద్వారా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుందని గణాంకాలు స్పష్టం చేశాయి. దేశంలో ప్రతీ ఏటా పాముకాటు వల్ల 50వేల మంది మృత్యువాతపడ్డారని గణాంకాలు వెల్లడించాయి. నగరాలు విస్తరించడానికి తోడు అడవుల

పాముకాటు ద్వారా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుందని గణాంకాలు స్పష్టం చేశాయి. దేశంలో ప్రతీ ఏటా పాముకాటు వల్ల 50వేల మంది మృత్యువాతపడ్డారని గణాంకాలు వెల్లడించాయి. నగరాలు విస్తరించడానికి తోడు అడవుల విస్తీర్ణం కాస్త తగ్గిపోవడం ద్వారా పాములు జనాలుండే ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. కానీ కారణాలు ఏమైనప్పటికీ ప్రతీ ఏడాది 50వేల మంది పాముకాటుకు బలైపోతున్నారని హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా వన్యప్రాణుల విభాగం మేనేజరు సుమంత్ మాధవ్ చెప్పారు.
 
ఈ మృతుల సంఖ్య బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో గణనీయంగా పెరిగిందని మాధవ్ తెలిపారు. ఇంట్లో పాము కనిపిస్తే చాలు మనం ఫోన్ చేసి పాములు పట్టేవారిని పిలిచి అతనితో పట్టించి దూరంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో వదులుతుంటారని ఇలా పాములను దూరంగా ఉన్న అడవుల్లో వదిలివేయడం వల్ల ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పాములు సైతం తక్కువకాలంలో మరణిస్తున్నాయని సుమంత్ మాధవ్ తెలిపారు.