మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (17:54 IST)

కోటలో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదే..

neet exam
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాకు చెందిన నీట్‌ విద్యార్థి రాజస్థాన్‌లోని కోట జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడైన విద్యార్థిని యుపిలోని మధుర జిల్లా బర్సానాలోని మన్‌పూర్ నివాసి అయిన పరశురామ్ (21)గా గుర్తించారు. 
 
పరశురామ్ అద్దెకు వుంటున్న ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందజేశాడు. పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరశురామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
ఆగస్టు 30న ఇంటి నుంచి కోటకు వచ్చాడు. మూడేళ్లుగా కోటాలో నీట్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు పరశురాం తండ్రి తెలిపారు. తొలి ప్రయత్నంలోనే 490 మార్కులు సాధించాడు. ఇటీవల పరీక్షలో 647 మార్కులు సాధించాడు. 
 
అయితే, ఇటీవల నీట్ వివాదం తర్వాత అతను ఒత్తిడికి గురయ్యాడు. చదువులో ఎప్పుడూ ముందుంటాడని.. మామ చతర్ సింగ్ చెప్పాడు.