గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (17:25 IST)

మిస్టర్ సెలెబ్రిటీ చిత్రంలో వినాయకచవితి పాటలో అలరించిన వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi Sarath Kumar
Varalakshmi Sarath Kumar
వరలక్ష్మీ శరత్ కుమార్ సోలోగా డాన్స్ వేస్తూ వినాయకచవితి పాటలో అలరించింది. గజానన.. గజానన. వే.వే.వేయిదండాలు గజానన.. అంటూ సాగిన ఈ పాట నేడు విడుదలచేసింది మిస్టర్ సెలెబ్రిటీ టీమ్. ఈ పాటను మంగ్లీ ఆలపించారు. గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ ఇచ్చిన బాణీ ఎంతో హుషారుగా అనిపించింది. ఇక ఈ వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా సినిమాలో కనిపిస్తుంది. 
 
సుదర్శన్ పరుచూరి హీరోగా  నటించిన ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ‘గజానన’ అంటూ సాగే పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
 
ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.
 తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు