ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (14:33 IST)

సోషల్ మీడియా స్నేహం.. పదివేల అప్పు ఇచ్చింది.. పెళ్లి పేరుతో లైంగికంగా..?

మహిళలపై అకృత్యాలు ఓ వైపు మోసాలు మరోవైపు జరుగుతూనే వున్నాయి. తాజాగా పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఫ్యాషన్‌ డిజైనర్‌పై చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ముంబైలోని కుర్లాలో వెలుగుచూసింది. వకోలా పోలీసులకు బాధిత యువతి (25) ఫిర్యాదు చేయడంతో నిందితుడు ఫర్కాన్‌ ఖాన్‌ (32)ను అరెస్ట్‌ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. గత ఏడాది జనవరిలో యువతి నిందితుడికి పరిచయమయ్యారు. సోషల్‌ మీడియాలో స్నేహంతో తాము ఆన్‌లైన్‌ చాటింగ్‌ను ప్రారంభించామని యువతి పోలీసులకు వివరించారు. బాధితురాలి నుంచి నిందితుడు రూ. 10,000 అప్పు తీసుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో తనకు అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగిఇస్తానని మహిళకు ఫోన్‌ చేశాడు.
 
ఆపై బాధితురాలి ఇంటికి వెళ్లిన ఫర్కాన్‌ పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను లైంగికంగా వేధించడం కొనసాగించాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఈనెల 22 వరకూ కస్టడీకి తరలించారు. తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశామని ముంబై పోలీసులు తెలిపారు