శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 జులై 2019 (12:29 IST)

బీజేపీకి మద్దతా.. ఎవరు చెప్పారు.. ప్రసక్తే లేదు : దేవెగౌడ

కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి జేడీఎస్ మద్దతు ఇవ్వబోతున్నట్టు వస్తున్న వార్తలను మాజీ ప్రధాని దేవెగౌడ కొట్టిపారేశారు. బీజేపీ సర్కార్‌కు మద్దతిచ్చేది లేదని, నిర్మాణాత్మాక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తేల్చి చెప్పారు. 
 
జేడీఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారన్న అంశాన్ని ఆయన ఖండించారు. మద్దతిచ్చే అంశాన్ని తొలుత జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి భేటీ అయిన సందర్భంగా కొందరు ప్రతిపాదించినట్టు ఆయన చెప్పారు. 
 
అయితే, నిర్ణయాధికారాన్ని కుమారస్వామికి వదిలేశామన్నారు. యడియూరప్ప ప్రమాణస్వీకారం చేయగానే ఆయన్ను అభినందిస్తూ జీటీ దేవెగౌడ ట్వీట్ చేశారు. అప్పటి నుంచే బీజేపీతో జేడీఎస్ చేతులు కలుపుతుందనే వాదనలు మొదలయ్యాయి. ఈ వార్తలపై దేవెగౌడ స్పందించారు. అలాంటి పరిస్థితే లేదని స్పష్టం చేశారు.