ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (09:07 IST)

పెళ్లి వేడుకలో తుపాకీ కాల్చారు.. తూటా పేలింది.. వరుడు మృతి

పెళ్లి ఇంట విషాదం నెలకొంది. సందడిగా జరుగుతున్న వివాహ మండపంలో పెళ్లి కొడుకే బలైయ్యాడు. ఈ ఘటన హరియాణాలోని కైథాల్ జిల్లా గుల్హా పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన విక్రమ్ (30)

పెళ్లి ఇంట విషాదం నెలకొంది. సందడిగా జరుగుతున్న వివాహ మండపంలో పెళ్లి కొడుకే బలైయ్యాడు. ఈ ఘటన హరియాణాలోని కైథాల్ జిల్లా గుల్హా పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన విక్రమ్ (30) స్విట్జర్లాండ్‌లో స్థిరపడ్డాడు. వివాహం కోసం పట్టణానికి వచ్చిన ఆయన శనివారం వివాహం చేసుకున్నాడు. పెళ్లి మండపంలో వివాహం ముగిసిన నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేసే దిశగా తుపాకీ కాల్చారు. 
 
అయితే తుపాకీ గురి తప్పి పెళ్లి కొడుకు గుండెలను చీల్చేసింది. దీంతో ఇరు కుటుంబీకులు షాక్ తిన్నారు. తేరుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. వరుడు ఎన్నారై కావడంతో పెళ్లి సంబరం అంబరాన్ని అంటింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు డ్యాన్సులతో జోష్‌లో మునిగిపోయారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని చాటుకునేందుకు బంధువుల్లో ఒకరు తుపాకిని గాల్లోకి పలుమార్లు కాల్చాడు.
 
ఈ క్రమంలో ఓ వ్యక్తి అతడికి తగలడంతో తుపాకి గురితప్పింది. తూటా నేరుగా వెళ్లి పెళ్లి కొడుకు గుండెలను చీల్చేసింది. వెంటనే అప్రమత్తమైన బంధువులు విక్రమ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వరుడు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.