మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (15:48 IST)

ఓలా డ్రైవర్లు మారరా? ఆ వీడియో ప్లే చేసి.. ప్యాంట్ జిప్ తీసి?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వివాదాలు, శిక్షలు పడుతున్నా కొందరు ఓలా క్యాబ్ డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగానే ప్రవర్తిస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఓ ఓలా డ్రైవర్ రెచ్చిపోయాడు. 22 ఏళ్ల సాఫ్ట్‌

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వివాదాలు, శిక్షలు పడుతున్నా కొందరు ఓలా క్యాబ్ డ్రైవర్లు మహిళల పట్ల అసభ్యంగానే ప్రవర్తిస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఓ ఓలా డ్రైవర్ రెచ్చిపోయాడు. 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని యలహంక న్యూటౌన్ నుంచి జేపీ నగర్ వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకుని.. కారు ఎక్కింది. ఆ కారు క్వీన్స్ సర్కిల్ దగ్గరకు రాగానే డ్రైవర్ చూపులో తేడా మొదలైంది.
 
దీన్ని గమనించి ఆమెకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో కారు కొద్దిదూరం వెళ్లగానే డ్రైవర్ తన మొబైల్ ఫోన్‌లో ఉన్న పోర్న్ వీడియో ప్లే చేశాడు. అంతటితో ఆగకుండా ఫ్యాంట్ జిప్ తీసి వెకిలి చేష్టలు చేశాడు. దీంతో షాకైన ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. 
 
షాక్ నుంచి తేరుకుని కారు ఆపమని కేకలు వేసింది. కానీ అతను వినిపించుకోలేదు. చివరికి కారును జేపీనగర్‌లో నిలిపాడు. అప్పటికే వణికిపోయిన ఆమె క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు దిగి పరిగెత్తింది. అనంతరం శనివారం కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు డ్రైవర్‌ను గుర్తించారు. త్వరలోనే అతనిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.