1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:28 IST)

దేశంలో విస్తరిస్తోన్న లంపీ వైరస్.. 67 పశువులు మృతి

cows
లంపీ వైరస్ దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటివరకే పలు రాష్ట్రాల్లో 67వేల పశువులు చనిపోయాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో పశువులకు ఈ ఏడాది జులైలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి వ్యాపించడం మొదలైంది. సుమారు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పశువులకు వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
 
లంపీ స్కిన్ డిసీజ్‌కు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఆయా రాష్ట్రాల్లో ‘గోట్ పాక్స్’ వ్యాక్సిన్ ను పశువులకు ఇస్తున్నారని కేంద్ర పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి శాఖ సెక్రెటరీ జతింద్రనాథ్ తెలిపారు.  
 
ఈ వ్యాక్సిన్ మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు వివరించారు. ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్‌లలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని జతింద్రనాథ్ తెలిపారు.