బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

పద్మ విభూషణ్ రావడం ఇషా వాలంటీర్లకు లభించిన గుర్తింపు : జగ్గీ వాసుదేవ్

కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డు 7 మిలియన్‌ల మంది మంది ఇషా కార్యకర్తలకు లభించిన గుర్తింపు అని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వ్యాఖ్యానించారు. 68వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర

కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డు 7 మిలియన్‌ల మంది మంది ఇషా కార్యకర్తలకు లభించిన గుర్తింపు అని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వ్యాఖ్యానించారు. 68వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఇషా కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ముఖ్యంగా తమిళ ప్రజలు ఇందుకోసం ఎక్కువ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. 'మా వాలంటీర్లను గుర్తించి అవార్డు ప్రకటించిన ప్రభుత్వానికి శుభాభినందనలు. ప్రజలకోసం వారు నిబద్ధత, నిస్వార్థంతో పనిచేస్తున్నారు' అని జగ్గీవాసుదేవ్‌ తెలిపారు. ఈ అవార్డు లభించినందుకు అందరికీ తాను హృదయపూర్వక వందనం చేస్తున్నానని, ఇది ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు.