కమల్ పార్టీని స్టాలిన్ అలా అనేశారే.. ఏమన్నారో తెలుసా?
సినీ లెజెండ్ కమల్ హాసన్ తమిళనాట బుధవారం కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. తన పార్టీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే తన స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు డీఎంకే చీఫ్ కరుణానిధి, పలువురు రాజకీ
సినీ లెజెండ్ కమల్ హాసన్ తమిళనాట బుధవారం కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. తన పార్టీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే తన స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు డీఎంకే చీఫ్ కరుణానిధి, పలువురు రాజకీయ నేతలను కమల్ హాసన్ కలుసుకున్నారు. అయితే కమల్ హాసన్‌పై రాజకీయ విమర్శలు అప్పుడే మొదలయ్యాయి.
డీఎంకే చీఫ్ కరుణానిధిని కమల్ హాసన్ కలిసినా.. కరుణ తనయుడు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మాత్రం లోకనాయకుడు పెట్టే పార్టీపై విమర్శలు గుప్పించారు. కాగితపు పువ్వులకు గుబాళింపు వుండదని.. ఇదే తరహాలోనే కొత్త పార్టీలు సువాసన లేని కాగితపు పువ్వులని ఏకిపారేశారు. త్వరలోనే అవి కనుమరుగైపోతాయని చెప్పారు.
అంతేగాకుండా స్టాలిన్ కార్యకర్తలకు రాసిన లేఖలో డీఎంకే మర్రిచెట్టులాంటిదన్నారు. దానికి బలమైన వేళ్ళు, కొమ్మలు వున్నాయంటూ కార్యకర్తల్లో జోష్‌ను పెంచేలా వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీలు సీజన్ పువ్వుల్లా వికసిస్తాయి. త్వరలోనే కనుమరుగవుతాయన్నారు.