మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (17:00 IST)

శశి(కళ-జయ)లలిత సినిమా తీయబోతున్నా... కనిమొళికి ఏమైంది? కేతిరెడ్డి ఆగ్రహం(Video)

లక్మీస్ వీరగ్రంధం సినిమా దర్శకుడు, నిర్మాత తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని అఖిలాండం వద్ద బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిర

లక్మీస్ వీరగ్రంధం సినిమా దర్శకుడు, నిర్మాత తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని అఖిలాండం వద్ద బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో మాట్లాడుతూ... తమిళంలో శశి(కళ-జయ)లలిత చిత్రాన్ని త్వరలో తెరకెక్కించనున్నట్లు తెలిపారు. తను ఏ శుభకార్యామైనా శ్రీవారి ఆశీస్సులతో మొదలుపెట్టడం ఆనవాయితీగా గత 40 సంవత్సరాలుగా చేస్తున్నట్లు తెలిపారు.
 
తెలుగు యువశక్తి స్థాపించినప్పుడు కూడా ఆ రిజిస్ట్రేషన్ కాగితలను స్వామి పాదాల చెంత ఉంచటం జరిగిందని గుర్తు చేసుకున్నారు. అందుకే ఆ సంస్థ ఇప్పటివరకు వెలుగొందుతున్నదని... నా నీడ... నా జాడ... వెంకన్నేనని తెలిపారు. ఇటీవల రాజ్యసభ సభ్యురాలు కనిమొళి వెంకన్నపై చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తంచేశారు. ఒక బాధ్యతగల స్థానంలో ఉన్నవారు హిందువుల ఆరాధ్యదైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి డబ్బు ఉన్నవారికే దైవం అనీ, దేవుడి యొక్క భద్రత విషయంలో కూడా ఆమె మాట్లాడిన మాటలు శ్రీవారి భక్తులను ఎంతో కలతకు గురిచేసిందన్నారు.
 
తమ రాజకీయ అవసరాల కొరకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమనీ, ఆమె వెంటనే తన తప్పును తెలుసుకొని శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.