సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (17:20 IST)

కోవిడ్ సోకిందని భార్యనే కడతేర్చాడు.. తలను శరీరం నుంచి వేరు చేశాడు..

కోవిడ్ సోకిందని భార్యనే కడతేర్చాడు.. ఓ కిరాతక భర్త. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బీహార్‌లోని పాట్నాలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి తన భార్యకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసి తలను శరీరం నుంచి వేరు చేశాడు. 
 
పత్రాకర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ లొకాలిటీలో ఉన్న ఓ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న దంపతుల మధ్య జరిగిన ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు.
 
అతుల్ లాల్ అనే వ్యక్తి.. పాజిటివ్ అని తెలియగానే భార్యను హతమార్చాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్ టెర్రస్‌పై నుంచి దూకేశాడు. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.