సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (05:48 IST)

2022 రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా పవార్?

జాతీయ రాజకీయాల్లో సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును రాష్ట్రపతి పదవికి అన్ని పార్టీలు పరిశీలించాలన్నారు శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్.

2022లో రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పేరును ప్రతిపాదించాలని పిలుపునిచ్చారు రౌత్. రాష్ట్రపతి పదవి కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రతిపాదించే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు పరిశీలించాలని కోరారు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్.

2022లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగేనాటికి ఆ పదవిని ఎవరు చేపట్టాలో నిర్ణయించేంత సంఖ్యాబలం తమకు ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు రౌత్.
 
ఉద్ధవ్ థాకరేతో అశోక్ గెహ్లాట్ సమావేశం 
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో సమావేశం అయ్యారు. ముంబైలోని థాకరే నివాసం మాతోశ్రీలో ఈ సమావేశం జరిగింది. మర్యాదపూర్వకంగానే థాకరేని కలిసినట్టు గెహ్లాట్ వెల్లడించారు.

‘‘మా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏమేం చేయగలమన్న దానిపై చర్చించాం. ఏయే విధానాలను రూపొందించాలన్న దానిపై సమాలోచనలు జరిపాం’’ అని గెహ్లాట్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పూర్తికాలం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇద్దరు సీఎంలతో పాటు థాకరే కుమారుడు ఆదిత్య థాకరే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.