సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (12:44 IST)

నోకియా సీఈఓతో ప్రధాని సమావేశం.. 5జీ జర్నీ, 6జీ ప్రణాళికలపై చర్చ

Modi
నోకియా సీఈఓ పెక్కా లండ్ మార్క్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. నెక్స్ట్-జెన్ డిజిటల్ ఇన్‌ఫ్రా గురించి చర్చించారు. భారతదేశంలో 5జీలో దాని తదుపరి దశ డిజిటల్ పరివర్తనకు నోకియా ఎలా దోహదపడుతుంది అనే దానిపై ఇద్దరూ సుదీర్ఘంగా మాట్లాడినట్లు నోకియా ప్రెసిడెంట్, సీఈవో ధ్రువీకరించారు. నోకియా ప్రెసిడెంట్, సీఈఓ పెక్కా లండ్‌మార్క్‌తో భేటీని ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ కూడా ధృవీకరించారు.  
 
ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, "మిస్టర్ పెక్కా లండ్‌మార్క్‌తో ఫలవంతమైన సమావేశం, దీనిలో మేము సాంకేతికతకు సంబంధించిన అంశాలను" చర్చించినట్లు తెలిపారు. 
 
పెక్కా లండ్‌మార్క్ ట్వీట్ చేస్తూ, "ప్రధాని మోదీని కలవడం మరియు భారతదేశం 5G ప్రయాణానికి, తదుపరి దశ డిజిటల్ పరివర్తనకు నోకియా ఎలా సహకరిస్తోంది. భారతదేశం 6G ఆశయాలకు మేము ఎలా మద్దతు ఇవ్వాలనుకుంటున్నామో చర్చించడం ఒక విశేషం." అంటూ పేర్కొన్నారు. 
 
నోకియా మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా భారతదేశం డిజిటల్ నెట్‌వర్క్‌ను ప్రశంసించారు. భారత దేశం 'భవిష్యత్తులో చౌకైన 5G మార్కెట్' అవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల శాతం చాలా ఎక్కువ అంటూ గుర్తు చేశారు.