సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (12:50 IST)

మోడీ 'ఫిదా'... ఆ కుర్రోడికి ఫోన్ చేశారు.. ఎందుకో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఫిదా' అయిపోయారు. అంతటితో ఆగలేక ఆయన స్వయంగా ఆ కుర్రోడికి ఫోన్ చేసిమరీ అభినందించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని భుజ్‌కు చెందిన మనోజ్ సోనీ అనే చిత్రకారుడు ప్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఫిదా' అయిపోయారు. అంతటితో ఆగలేక ఆయన స్వయంగా ఆ కుర్రోడికి ఫోన్ చేసిమరీ అభినందించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని భుజ్‌కు చెందిన మనోజ్ సోనీ అనే చిత్రకారుడు ప్రధాని నరేంద్ర మోడీని మురిపించాడు.
 
ఐదు నెలలు శ్రమించి 80 చదరపు అడుగుల సైజులో కలర్ పెన్సిళ్లను ఉపయోగించి అద్భుతమైన మోడీ బొమ్మను గీశాడు. దీన్ని మోడీకి స్థానిక బీజేపీ నేతలు పంపగా.. ఆయన ఫిదా అయిపోయారు.
 
ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ  ఫోన్ చేసి మరీ మనోజ్‌ని అభినందించారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పైగా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సిల్ స్కెచ్‌గా చెబుతున్నారు.