శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (15:55 IST)

మోడీని ఏమైనా అంటే నరకడానికి వెనుకాడం : బీజేపీ ఎంపీ

భారతీయ జనతా పార్టీ ఎంపీ, బీహార్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని వేలెత్తి చూపినా, చెయ్యెత్తి చూపినా వాటిని నరికేస్తామని హెచ్చ‌రించారు. న

భారతీయ జనతా పార్టీ ఎంపీ, బీహార్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని వేలెత్తి చూపినా, చెయ్యెత్తి చూపినా వాటిని నరికేస్తామని హెచ్చ‌రించారు. న‌రేంద్ర‌ మోడీ పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారని అన్నారు.
 
మోడీని ఏమైనా అంటే నరక‌డానికి కూడా వెనుకాడబోమని హెచ్చ‌రించారు. మోదీ రూపంలో స్వామి వివేకానంద మళ్లీ పుట్టారని వ్యాఖ్యానించారు. నిత్యానంద చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శ‌ల దాడి మొద‌లుపెట్టారు.
 
మరోవైపు బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి కూడా మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మంగళవారం జరిగిన ఆర్జేడీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, బీహార్‌లో చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొంతు కోసేందుకు, ఆయన చేతులు నరికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
నరేంద్ర మోడీపై ఆరోపణలు చేసేవారి వేళ్ళు నరుకుతామని వాళ్ళు అంటున్నారని, అలా చేస్తే, ఊరికే కూర్చునేందుకు దేశంలో ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బీహార్ జనం ఏమీ అనరా? మోడీ తల నరికేందుకు, ఆయన చేతిని ముక్కలు చేసేందుకు ఇక్కడ చాలా మంది ఉన్నారన్నారు. ఇందుకోసం తాము జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు రాజకీయ వర్గాల్లో వివాదాస్పదమయ్యాయి.