బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:21 IST)

అమ్మ ఇక లేదని తెలుసు.. అయినా విధుల్లోకి ప్రధాని మోదీ

Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులు, బిజెపి నాయకుల నుండి ప్రశంసలు అందుకున్నారు, వారు ప్రధాని నిబద్ధతను నాయకులు మెచ్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తన తల్లిని కోల్పోయిన రోజున తన వృత్తిపరమైన బాధ్యతలను మోదీ కొనసాగించారు. తద్వారా బీజేపీ నేతల చేత ఆయన "కర్మయోగి" అనిపించుకున్నారు. 
 
అహ్మదాబాద్ ఆసుపత్రిలో 100 సంవత్సరాల వయస్సులో మరణించిన తన తల్లి హీరాబెన్ అంత్యక్రియలకు హాజరైన మోదీ, అంత్యక్రియలకు తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ. 7,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించాలని ఎంచుకున్నారు.
 
ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ జాతీయ గంగా కౌన్సిల్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించారు.