1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (08:57 IST)

వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి : తల్లి మృతిపై ప్రధాని మోడీ ట్వీట్

modi heeraben
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి స్వర్గస్తులయ్యారు. ఆమె శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 100 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిన ఆమె.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన తల్లి మరణవార్తను ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
 
"వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని" పేర్కొన్నారు. ఆమె నిస్వార్థ కర్మయోగి అని ఆమె జీవితం విలువలతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఆమె వందో పుట్టిన రోజునాడు తాను తన తల్లిని కలిశానని గుర్తు చేశారు. పైగా, ఆమె  ఎపుడూ తనతో  విషయాన్ని చెప్పేవారనీ, విజ్ఞతతో పని చేయాలని, జీవితాన్ని స్వచ్చంగా గడపాలని చెప్పేవారని గుర్తుచేశారు. కాగా, గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో తల్లి హీరాబెన్‌ను ప్రధాని మోడీ కలుసుకున్న విషయం తెల్సిందే.