శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (17:33 IST)

ప్రధాని మోడీ నిర్ణయం మానవత్వం లేని చర్య... పెను విపత్తుగా మారొచ్చు : అమర్త్య సేన్

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదనీ, మానవత్వం లేని చర్యగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. ఆయన బుధవారం కర

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదనీ, మానవత్వం లేని చర్యగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. ఆయన బుధవారం కరెన్సీ నోట్ల రద్దుపై స్పందించారు. ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇది తెలివైనది కాదని, మానవత్వం లేని చర్యగా ఆయన అభివర్ణించారు. 
 
కరెన్సీ నోట్లు, బ్యాంకులు, బ్యాంకు ఖాతాలతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థను మోడీ నిర్ణయం బలహీన పరిచిందని అమర్త్య సేన్ ఆరోపించారు. నమ్మకంపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ మూలలకు అడ్డుకట్ట వేసే చర్య అని అన్నారు. ప్రజల ఆర్థిక విశ్వాసాన్ని దెబ్బతీయడంతోపాటు ప్రభుత్వం నోటుపై ఇచ్చిన వాగ్ధానాన్ని వమ్ముచేయడమేనని ఆయన అన్నారు. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, భారత ఆర్థిక వ్యవస్థకు పెను విపత్తుగా మారవచ్చని అమర్త్య సేన్ ఆందోళన వ్యక్తంచేశారు.