శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 జూన్ 2017 (09:21 IST)

దేశవ్యాప్తంగా రంజాన్ సందడి... ప్రజలకు నేతల ఈద్‌ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగను ముస్లిం సోదరులు భక్తిప్రపత్తులతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈద్‌ ముబారక్ సందర్భంగా శుభ

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగను ముస్లిం సోదరులు భక్తిప్రపత్తులతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈద్‌ ముబారక్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సంతోషాన్ని పంచడానికి ఇలాంటి పండగల నుంచి స్ఫూర్తిని పొందాలన్నారు. భిన్నత్వమే మన దేశ బలమని మన్‌కీబాత్‌ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. 
 
ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ముబారక్‌పూర్‌ గ్రామవాసులు అంతా కలిసి టాయిలెట్లు కట్టుకుంటామన్నారని, దాంతో ప్రభుత్వం వారికి రూ.17 లక్షలు కేటాయించగా, వాళ్లు తమ సొంత శ్రమతో టాయిలెట్లు కట్టుకుని ఆ సొమ్ము వెనక్కి ఇచ్చేశారని తెలిపారు. సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ ఈ మూడు రాష్ట్రాలు బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రాలుగా ప్రకటించారని, ఇటీవలే హరియాణా, ఉత్తరాఖండ్‌ కూడా వీటిలో చేరాయని చెప్పారు. 
 
అలాగే ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొన్న తీరును, ఇస్రో ప్రయోగ విజయాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ఇండోనేసియా ఓపెన్‌ గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్‌ను ప్రధాని అభినందించారు. ఇక దేశ ప్రజాస్వామ్య చరిత్రలో 1975 సంవత్సరంలో ఈరోజు చాలా చీకటి రోజని ఎమర్జెన్సీని గుర్తుచేసుకుంటూ చెప్పారు.