ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (07:10 IST)

ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ పోర్న్‌హబ్ ఉద్యోగి... వెబ్‌సైట్ ట్వీట్

ఇద్దరు మహిళలతో రాసలీలల్లో మునిగిపోయి మంత్రి పదవిని పోగొట్టుకున్న ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ గురించి సంచలన విషయం ఒకటి వెలుగు చూసింది. సందీప్ కుమార్ పోర్న్‌హబ్ ఉద్యోగి అనే వార్త ప్రతి ఒక్కరినీ షాక్‌క

ఇద్దరు మహిళలతో రాసలీలల్లో మునిగిపోయి మంత్రి పదవిని పోగొట్టుకున్న ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ గురించి సంచలన విషయం ఒకటి వెలుగు చూసింది. సందీప్ కుమార్ పోర్న్‌హబ్ ఉద్యోగి అనే వార్త ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇదే అంపై యూజర్లు అప్‌లోడ్ చేసే కంటెంట్‌పై ఆధారపడి నడుస్తున్న పోర్న్‌హబ్ వెబ్‌సైట్ ఓ ప్రకటన చేసింది. 
 
సందీప్‌కుమార్ తమ ఉద్యోగేనని ప్రపంచంలో అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్లలో ఒకటైన ఈ వెబ్‌సైట్ ఓ ప్రకటనలో పేర్కొంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, సందీప్ కుమార్ సహా, ఉద్యోగులందరినీ తాము ప్రేమిస్తున్నట్టు ఓ ట్వీట్ కూడా పెట్టింది.
 
ఇద్దరు మహిళలతో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సీడీ లభించడంతో సందీప్‌ను కేబినెట్‌ నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలగించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆయన పోర్న్‌జాబ్ చేస్తున్నట్లుగా ట్వీట్ రావడం ఆయన్ను మరింత కష్టాల్లో నెట్టేసింది.