1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 మే 2016 (12:01 IST)

కేంద్రం ఇచ్చే బియ్యానికి అమ్మ బియ్యం స్టిక్కర్లు : ప్రకాష్ జవదేకర్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని జయలలిత తన స్టిక్కర్‌ అంటించుకుని 'అమ్మ బియ్యం' అని ఆర్భాటం ప్రచారం చేసుకుంటున్నారనీ మండిపడ్డారు. చెన్నైలో జరిగిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ... కేజీ బియ్యంపై కేంద్రం రూ.33 చెల్లించి ఉచితంగా రాష్ట్రానికి అందిస్తోందన్నారు. 
 
జయలలిత మాత్రం ఆ బియ్యంపై తన బొమ్మ ఉన్న స్టిక్కర్‌ అంటించుకుని రాష్ట్రమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వరదల్లో బాధితులు అల్లాడుతుంటే ప్రధాని చలించారని, వెంటనే వచ్చి రూ.2 వేల కోట్ల సాయం అందించారని గుర్తుచేశారు. అప్పుడూ ఆమె మాత్రమే సాయం చేసినట్లు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. 
 
మరోమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఐదు దశాబ్దాలుగా పాలించిన ద్రవిడ పార్టీల సేవలు ఇక చాలన్నారు. ప్రజలకు అవినీతి లేని పాలన కావాలంటే భాజపాను గెలిపించాలని కోరారు. రెండేళ్ల మోడీ పాలనపై ఎలాంటి ఆరోపణలూ లేవని గుర్తుచేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.