శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (19:58 IST)

'మడ్ లవ్' పైత్యం - పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్... ఫోటోలు వైరల్

ఇటీవలి కాలంలో యువతీ యువకుల మధ్య వింత చర్యలు ఎక్కువైపోయాయి. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత, శోభనంకు ముందు.. శోభనం పూర్తయ్యాక, ప్రసవం తర్వాత అంటూ కొంతమంది యువజంటలు ఫోటో షూట్‌లు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని నెటిజన్లు విపరీతంగా చూడటం వల్ల వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ తరహా చర్యలు వారి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించినదే అయినప్పటికీ ఇక్కడ కొంత పైత్యం కనపడుతుండటంతో విమర్శల పాలవుతోంది.
 
తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన ఓ యువ జంట పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్ జరుపుకుంది. 'మడ్ లవ్' పేరుతో ఆ కొత్త జంట.. బురదలో వింత వింత విన్యాసాలు చేసింది. బీను సీన్స్ అనే ఫొటో స్టూడియో సంస్థ ఈ ఫొటో షూట్ జరిపింది. 
 
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత కంటే మంచి ఆలోచన వేరేది లేదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తమిళ సినిమాలు ఎక్కువగా చూసుంటారని.. అందుకే ఈ విధమైన ఫోజులు పెట్టుంటారని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.