గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (15:47 IST)

పార్కులో పట్టపగలు ప్రియుడితో శృంగారం.. అరెస్టయిన జంట.. ఎక్కడ?

పార్కులో పట్టపగలు ప్రియుడితో శృంగారంలో మునిగి తేలిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియా, ఆక్స్‌ఫోర్డ్‌షైర్‌లోని బీసెస్టర్ పింగిల్ ఫీల్డ్‌ పార్కులో చోటుచేసుకుంది. బహిరంగంగా పబ్లిక్ పార్కులో ఓ జంట శృంగారంలో పాల్గొంది. ఈ తంతును అక్కడున్న జనం చూడలేక.. తల తిప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది.
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పార్కులో శృంగారంలో మునిగిపోయిన జంటను అరెస్ట్ చేశారు. యూకే చట్టం ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో శృంగారం నిషిద్ధం. దీంతో ప్రస్తుతం అరెస్టయిన జంటకు శిక్ష ఖరారయ్యే అవకాశం వుంది. 
 
ఇందుకోసం ప్రత్యక్ష సాక్షుల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ తీసుకుని సదరు జంట అభ్యంతరకర భంగిమలో పార్కులో కనిపించారని ఇప్పటికే సాక్ష్యులు తెలిపారు. ప్రియుడితో కలిసి పార్కులో శృంగారంలో పాల్గొన్న మహిళ వయస్సు 30 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు.