1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (18:20 IST)

పరోటా తిన్న గర్భిణీ మహిళతో పాటు గర్భస్థ కవలలు మృతి

పరోటా తిన్న గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అంతేగాకుండా ఆమె కడుపులోకి గర్భస్థ కవలలు సైతం మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, అరుప్పుకోట్టై సమీపంలోని వదువార్పట్టి అనే ప్రాంతంలో ఐదు నెలల గర్భిణీ మహిళ ఆనందతాయి పరోటా తిన్నట్లు తెలిసింది. 
 
కొద్దిసేపట్లోనే ఆమెకు కడుపులో నొప్పి ఏర్పడింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆనందతాయికి అప్పుడప్పుడు పరోటాలు తినే అలవాటుంది. 
 
భార్య అడిగిందని ఆనందతాయి భర్త.. రోడ్డు పక్కనున్న పరోటా కొనిపెట్టాడు. కానీ ఆ పరోటా తిన్న కాసేపటికే ఆమె అస్వస్థతకు గురైంది. ఆస్పత్రిలో చేరినా చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.