గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (12:45 IST)

వైద్యుని నిర్లక్ష్యం.. వైద్యం వికటించి నిండు గర్భిణీ మృతి

వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నర్సంపేటలో వైద్యం వికటించి నిండు గర్భిణి చనిపోయింది. దుగ్గొండి మండలం మధిరకు చెందిన లావణ్య(24)కు నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన రాకేశ్రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహమైంది. 
 
ప్రస్తుతం లావణ్య నిండు గర్భిణి. శనివారం పురిటి నొప్పులు రావడంతో ఆమె అత్త రేణుక నర్సంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లింది. నొప్పులు రావడం సహజమేనని.. ఏమీ కాదని డాక్టర్ చెప్పారు.
 
ఆదివారం ఉదయం మరోసారి నొప్పులు రావడంతో కాంపౌండర్ ఒక ఇంజక్షన్ ఇచ్చారు. కొన్ని నిమిషాల్లోనే లావణ్య చనిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం, వైద్యం వికటించడంతోనే తమ బిడ్డ మృతి చెందిందని లావణ్య కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.