దుబాయ్ వీధుల్లో టర్కిష్ ఐస్ క్రీమ్‌ను రుచి చూసిన అనంత్ రాధిక (Video)
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ (రాధిక అనంత్) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీని వివాహం చేసుకుని, అంబానీ ఇంట్లో చిన్నకోడలిగా అడుగుపెట్టారు. అయితే, ఇపుడు ఆమెకు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన భర్త అనంత్ అంబానీ, కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన ఆమె ఒక టర్కిష్ స్టాల్ వద్ద ఐస్‌క్రీం ఆర్డర్ చేశారు. ఆ స్టాల్‌లో ఉన్న వ్యక్తి ఐస్‌క్రీం ఇవ్వడానికి ముందు కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంటాడు.
ఇలా చిన్నారులను సరదాగా ఏడిపించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటాయి. ఇపుడు రాధికా మర్చంట్స్‌కు కూడా అలాంటి సరదా సందర్భమే ఎదురైంది. ఎన్నోసార్లు కోన్ ఐస్‌క్రీమ్ ఆమె చేతికి వరకు వచ్చినట్టే వచ్చే వెనక్కి వెళ్ళిపోవడం ఆ వీడియోలో కనిపించింది. ఎన్నో జిమ్మిక్కుల తర్వాత ఐస్‌క్రీమ్ ఆమె వద్దకు చేరడంతో ఆమె దానిని టేస్ట్ చేశారు.