శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (19:50 IST)

బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సెంట్రల్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో ఉన్న తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసారు. మోదీ ఇంటి పేరును కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే కేసులో రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో, ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
 
ఎంపీగా సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో నెల రోజుల్లోగా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని రాహుల్‌కు లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే, నోటీసులో పేర్కొన్న చివరి రోజైన ఈరోజు ఆయన బంగ్లాను ఖాళీ చేశారు.