శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (22:33 IST)

అదానీ కంపెనీల్లో రూ.20వేల కోట్ల సొమ్ము ఎవరిది?: రాహుల్ గాంధీ

rahul gandhi
మోదీ ఇంటిపేరు కేసులో సూరత్‌లోని సెషన్స్ కోర్టు తన బెయిల్‌ను పొడిగించిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళవారం అదానీ కంపెనీలలో మనీ ట్రైయల్‌ను ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మిగిలిన 100 మంది అభ్యర్థులను ఖరారు చేసే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కోసం కాంగ్రెస్  కార్యాలయానికి రాహుల్ గాంధీ వచ్చారు.
 
న్యాయవ్యవస్థపై బీజేపీ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బీజేపీ ఏదో చెప్పేస్తుందని ఎదురు చూడటం ఎందుకు.. అదానీ షెల్ కంపెనీల్లో రూ.20 వేల కోట్ల సొమ్ము ఎవరిదని రాహుల్ గ్రాంధీ ప్రశ్నించారు. మోదీ ఇంటి పేరు కేసు పోరాటంలో సత్యం తన ఆయుధం అని రాహుల్ వ్యాఖ్యానించారు.