రఘురాం రాజన్ కథ ముగిసింది.. ఇక కేజ్రీవాలే టార్గెట్ అంటోన్న సుబ్రహ్మణ్య స్వామి!
ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌ను రెండోసారి ఆర్బీఐ గవర్నర్ పదవికి పోటీపడకుండా చేశానని.. ఇక తన తదుపరి లక్ష్యం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని బీజేపీ నేత సుబ్రహ్మణ్యయ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్
ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌ను రెండోసారి ఆర్బీఐ గవర్నర్ పదవికి పోటీపడకుండా చేశానని.. ఇక తన తదుపరి లక్ష్యం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని బీజేపీ నేత సుబ్రహ్మణ్యయ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఇంటి ముందు దీక్ష చేస్తున్న బీజేపీ నేత మహేష్ గిరికి మద్దతిచ్చేందుకు వచ్చిన స్వామి మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ తన జీవితం మొత్తం మోసాలు చేసే ఈ స్థాయికి ఎదిగారన్నారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు ఐఐటీలో అడ్మిషన్ ఎలా వచ్చిందనే విషయాన్ని త్వరలో బయటపెడతానని స్వామి వ్యాఖ్యానించారు. ఆయన అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని .. దీని నుంచి కేజ్రీవాల్ ఎలా తప్పించుకుంటారో చూస్తానంటూ స్వామి సవాల్ విసిరారు.
ఆర్‌బీఐ గవర్నర్ రఘరాం రాజన్ విధానాన్ని తప్పుబడుతూ ఆయనపై విమర్శలు గుప్పించి రెండోసారి పదవి చేపట్టకుండా చేసిన సుబ్రమణ్య స్వామీ... కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తానడంతో కేజ్రీవాల్ సన్నిహితుల్లో ఉత్కంఠ నెలకొంది.