శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (12:56 IST)

కుమార్తెపై అత్యాచారం.. ఆపై గొంతునులిమి చంపేసిన కసాయి తండ్రి

తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం బయటకు చెపుతుందని భావించి గొంతునులిని హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్

తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం బయటకు చెపుతుందని భావించి గొంతునులిని హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రామేశ్వరం సమీపం కరయూర్‌ గ్రామంలోని సముద్రపు ఒడ్డున ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
పోస్టుమార్టంలో చిన్నారి అత్యాచారానికి గురై గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో అదే గ్రామానికి చెందిన మారి కుమార్తె అని తెలిసింది. తండ్రే కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్లు తెలియడంతో బంధువుల ఇంట్లో తలదాచుకున్న మారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.