బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (12:01 IST)

జయలలిత వారసుడిని నేనే ... 3 నెలల్లో కుప్పకూలుతుంది : దినకరన్

తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంల సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు సరిగ్గా మూడు నెలల్లో కుప్పకూలుతుందని ఆ పార్టీ అసమ్మతి నేత టీటీవీ దినకరన్

తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంల సారథ్యంలోని అన్నాడీఎంకే సర్కారు సరిగ్గా మూడు నెలల్లో కుప్పకూలుతుందని ఆ పార్టీ అసమ్మతి నేత టీటీవీ దినకరన్ జోస్యం చెప్పారు. 
 
ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే దినకరన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో తన గెలుపు తథ్యమని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరంటూ దినకరన్ వ్యాఖ్యానించారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, ఎడప్పాడి పళిస్వామి, పన్నీర్ సెల్వం సారథ్యంలో నడుస్తున్న తమిళనాడు ప్రభుత్వం మూడు నెలల్లో కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమనీ.. పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, దానికి నిదర్శనమే ఆర్కే.నగర్ వాసులు ఇస్తున్న తీర్పు అని వ్యాఖ్యానించారు. 
 
ఆర్కే నగర్ ఉపఎన్నికలు తమిళనాడు ప్రజల మనోభావాలకు అద్దంపడుతున్నాయన్నారు. జయలలిత స్థానంతో ప్రజలు తనను చూడాలని కోరుకుంటున్నారనీ... ఆమె వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత తనకు అప్పగించారన్నారు.