శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (11:14 IST)

ఖాకీ దుస్సాహసం.. లోక్‌సభ ఎంపీకి తుపాకీ గురి

ఓ కానిస్టేబుల్ దుస్సాహసానికి పాల్పడ్డాడు. కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్ నాథ్‌కు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే ఎంపీ బాడీ గార్డ్స్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.

ఓ కానిస్టేబుల్ దుస్సాహసానికి పాల్పడ్డాడు. కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్ నాథ్‌కు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే ఎంపీ బాడీ గార్డ్స్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయలేవీ కమల్ నాథ్‌కు తెలియదు. ఛిన్‌లోని విమానాశ్రయం నుంచి ఢిల్లీకి శుక్రవారం ఆయన వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కమల్‌ నాథ్‌ ఢిల్లీకి చార్టెడ్‌ విమానంలో బయలుదేరేందుకు ఛిన్‌ద్వారాలోని విమానాశ్రయానికి శుక్రవారం వచ్చారు. ఈ సమయంలో రత్నేష్‌ పవార్‌ అనే కానిస్టేబుల్‌ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కమల్‌నాథ్‌ విమానం ఎక్కుతుండగా.. పవార్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను ఆయన వైపు గురిపెట్టాడు.
 
దీన్ని గమనించిన ఆయన బాడీగార్డ్స్ అప్రమత్తమై కానిస్టేబుల్‌ను అడ్డుకొని పక్కకు తోసేశారు. ఈ ఘటన నేపథ్యంలో పవార్‌ను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించామని ఏఎస్పీ నీరజ్‌ సోనీ వెల్లడించారు. కాగా, తనపై కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్ ఎక్కుపెక్కిన విషయం కమల్ నాథ్ దృష్టికి రాలేదు.