సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (14:43 IST)

205 అడుగుల ఎత్తులో భయంతో బిక్కచచ్చిపోయిన ప్రయాణికులు.. ఎందుకో తెలుసా?

roller coaster
దాదాపు 205 అడుగులు ఎత్తులో ప్రయాణికులు ఆగిపోయారు. దీంతో వారంతా బిక్కచచ్చి పోయారు. సాఫీగా సాగిపోతూ వచ్చిన రోలర్ కోస్టర్ ఉన్నట్టుండి 205 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తూ వచ్చిన వారంతా ప్రాణభయంతో వణికిపోయారు. ఈ ఘటన అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని శాన్‌డస్కీలోని అమ్యూజ్‌మెంట్ పార్కులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ పార్కులో ఉన్న రోలర్ కోస్టర్ 205 అడుగుల ఎత్తులో ఉన్నట్టుండి ఆగిపోయింది. దీంతో రైడ్ ఎంజాయ్ చేద్దామని దానిపైకి ఎక్కినవారు ప్రాణభయంతో వణికిపోయారు. సాంకేతిక కారణాలతో ఇది ఆగిపోయింది. దీంతో పైన చిక్కుకున్న వారిని జాగ్రత్తగా కిందికి దించారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడటంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
కానిస్టేబుల్‌ భర్తను హత్య చేసిన భార్య..  
 
విశాఖపట్టణంలో ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్య చేతిలోనే హతమయ్యాడు. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితురాలు అతి చేసి పోలీసుల చేతికి చిక్కింది. తమది అన్యోన్య దాంపత్యమని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసి చివరకు అడ్డంగా బుక్కైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల విశాఖపట్టణానికి చెందిన రమేశ్ అనే ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు కీలక విషయాలను వెల్లడించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య శివజ్యోతి.. అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. ఆ తర్వాత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పడిన తాపత్రయే పలు అనుమానాలకు దారితీసింది.
 
భర్త హత్యకు కొన్ని రోజుల ముందు నుంచే అతడితో ప్రేమగా ఉన్నట్టు నిందితురాలు కొన్ని వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మద్యం మత్తులో తూలిపోతున్న రమేశ్‌ను మంచంపై పడుకోబెట్టడం, భార్య మంచిదని అతడు వీడియోలో చెప్పడం వంటి దృశ్యాలను ఆమె చాకచక్యంగా రికార్డు చేసంది. హత్య అనంతరం విచారణకు వచ్చిన పోలీసులకు శివజ్యోతి ఈ వీడియోలను కూడా చూపించి, తమది అన్యోన్య దాంపత్యమని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.
 
దీంతో ఆమెను అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే ఆమె ఇదంతా చేసి ఉంటుందని అనుమానించిన పోలీసులు చివరకు వాస్తవాన్ని వెలికి తీశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న శివజ్యోతి, ఏ2గా ఉన్న ఆమె ప్రియుడు, ఏ3 అయిన వెల్డర్ నీలాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.