శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఒడిశా ఘటన-రెస్క్యూ టీమ్‌లకు ప్రధాని మోదీ అభినందనలు

Modi
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 280 మందికి పైగా మరణించారు. 800 మందికి పైగా గాయపడగా, పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఒడిశా రైలు ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 90 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే యంత్రాంగం తెలియజేసింది. అలాగే, 46 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తున్నాయి. 11 రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. 
 
ఈ నేపథ్యంలో ఒడిశా రైలు ప్రమాదంలో పోరాడిన రెస్క్యూ టీమ్‌లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ విషయమై ప్రధాని మోదీ విడుదల చేసిన ట్విట్టర్ సందేశంలో.. కష్టాల్లోనూ ప్రజల ధైర్యం ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మన దేశ ప్రజలు చూపిన ధైర్యం, దయ స్ఫూర్తిదాయకం. ప్రమాదం తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రక్తదానం చేసేందుకు క్యూలో నిలబడ్డారు.
 
రెస్క్యూ ఆపరేషన్‌లను పటిష్టం చేసిన విపత్తు రెస్క్యూ టీమ్, పోలీసులు, వాలంటీర్లందరికీ వందనాలు. ప్రపంచ నాయకుల సంతాపం దుఃఖంలో ఉన్న కుటుంబాలకు బలం చేకూరుస్తుంది. ప్రపంచ దేశాధినేతలు అందిస్తున్న సపోర్ట్‌కి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.