గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మే 2023 (08:54 IST)

ప్రధాని మోడీ ప్రత్యేక పూజలతో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం

pmmodi
దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. కొత్త పార్లమెంట్‌ భవంతి వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించిన మోడీ... నూతన ప్రజాస్వామ్య సౌధంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేశారు.
sengol
 
ఆ తర్వాత తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి 'ఉత్సవ రాజదండం' (సెంగోల్‌)ను ఆయన స్వీకరించి, దాన్ని లోక్‌సభలో స్పీకర్‌ కుర్చీ పక్కన ప్రతిష్టించి, మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులను ప్రధాని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.