గురువారం, 8 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 26 మే 2023 (17:02 IST)

నరేంద్ర మోదీని చంపుతానంటూ వ్యక్తి బెదిరింపు.. కాల్‌ను ట్రేస్ చేసి..?

Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరించాడు. గురువారం రాత్రి రాత్రి ఢిల్లీలోని పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ కాల్‌ను ట్రేస్ చేసి నగరంలోని ప్రసాద్ నగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
 
హేమంత్ కుమార్ అనే 48 ఏళ్ళ వ్యక్తి మద్యం మత్తులో ఈ బెదిరింపు కాల్ చేశాడని, ఇతడిని అదుపులోకి తీసుకున్నామని ఖాకీలు తెలిపారు. అతని వద్ద పోలీసులు విచారిస్తున్నారు. 
 
తనకు ఉపాధి లేదన్న కోపంతో ప్రధానిని హతమారుస్తానంటూ హేమంత్ కుమార్ బెదిరిస్తున్నాడని పోలీసులు చెప్పారు.