శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (10:24 IST)

భార్యను చనిపోమన్నాడు.. కట్నం కోసం రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరికి?

woman
వరకట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేశాడు ఓ భర్త. అది కూడా పుట్టింటి నుంచి డబ్బు తేవాలని ఒత్తిడి చేయలేదు. భార్యను చనిపోవాలని.. ఆమె చనిపోతే మరో యువతిని పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. 
 
భార్యను చావమని వేధించి నరకం చూపించాడు. ఆమె చనిపోతే.. భారీగా కట్నం వస్తుందని భర్త చిత్రహింసలకు గురిచేశాడు. భర్త చిత్రహింసలు తాళలేక ఆ మహిళ భర్త నుంచి తప్పించుకుని స్వదేశం చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండలానికి చెందిన 32 ఏళ్ల యువతి శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్ రెడ్డితో 2017లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లయిన దంపతులు అమెరికాకు వెళ్లారు. వారికి ఓ బాబు కూడా వున్నాడు. 
 
కొంతకాలం అదనపు కట్నం కోసం ప్రవీణ్ రెడ్డి భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అదనపు కట్నం ఇవ్వకపోవడంతో పలుమార్లు దాడి చేసి ఆమెకు భోజనం, మంచినీళ్లు ఇవ్వకుండా గదిలో బంధించాడని పోలీసుల ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.