బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (17:21 IST)

మణిపూర్‌‌లో రూ.1800లకు వంట గ్యాస్‌ ధర

gas cylinder
మణిపూర్‌‌లో రూ.1800లకు వంట గ్యాస్‌ ధర చేసింది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటోంది. రిజర్వేషన్ల విషయంలో రేగిన వివాదం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌‌లో హింసాత్మక ఆందోళనలకు దారితీసింది. మూడు వారాల నుంచి మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.
 
ఇతర రాష్ట్రాల నుంచి మణిపూర్‌‌కు ట్రక్కులు నడిపేందుకు యజమానులు, డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో నిత్యావసర వస్తువులకు రాష్ట్రంలో కొరత ఏర్పడింది. దీంతో అందుబాటులో ఉన్న సరుకుల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు. 
 
వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో సిలిండర్‌ ధర రూ.1800లకు పైకి చేరిందని వాపోయారు.